top of page

మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరులో మెగా రక్తదాన శిబిరం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 16
1 min read

మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరులో మెగా రక్తదాన శిబిరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రొద్దుటూరులోని శ్రీ నామ ఎరుకలయ్య ఆశ్రమంలో సత్యన్న సేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘం గౌరవాధ్యక్షుడు ఒంటెరు శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్‌ హరినారాయణ, డాక్టర్‌ వరుణ్‌కుమార్‌ ప్రారంభించి, వారి అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలను ఇలా సేవా కార్యక్రమంగా మలచడాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ బృహత్తర సేవా కార్యక్రమంలో సత్యన్న సేన సభ్యులు సృజనీష్‌, కిరణ్‌, శివ, హరీష్‌, లోకేష్‌రెడ్డి, ఒంటెరు భాస్కర్‌రెడ్డి లతో పాటు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌ నాయుడు, బీజేపీ కడప జిల్లా కార్యదర్శి చిరు, బీజేపీ నాయకుడు వంకదర నరేంద్ర, బిజెపి మహిళా వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రెడ్డి ప్రసన్న, అఖిల, కుమారి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page