top of page

ప్రశ్నార్థకంగా మారిన ఫ్లెక్సీ.

Writer: DORA SWAMY
DORA SWAMY
Feb 26, 2024
1 min read

ప్రశ్నార్థకంగా మారిన ఫ్లెక్సీ.

చిట్వేలి గ్రామ పరిధిలోనీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సముదాయంలో ఆదివారం తారసపడ్డ ఈ ఫ్లెక్సీ ప్రశ్నార్థకంగా మారింది. ఇందులోనీ అర్థం ఏమిటి? ఎవరు ఏర్పాటు చేశారు?అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మిరపకాయకు మనిషి రూపం లో మీసాలు పెట్టి,పిడికిలి బిగించి చూపుడు వేలును చూపిస్తూ "అరెత్తాయ్....ఇట్నే సూచ్చువుండు"అన్న వాక్యంతో బ్యానర్ ఏర్పాటు చేయడంతో అందరి దృష్టి ఆకర్షిస్తుంది. అయితే ఆ వాక్యం వెనుక ఉన్న అర్థం తెలియక మండల ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు లో దాగివున్న నిగూఢ రహస్యం ఏమిటని చర్చించుకుంటున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, మండలాల్లో ఒకే రకమైన ఈ ఫ్లెక్సీలను పోలీసులు, ప్రజలు గుర్తించకుండా ఎవరు ఏర్పాటు చేస్తున్నారన్నది అతి పెద్ద రహస్యం. ఎప్పుడు, ఎవ్వరు చేదిస్తారాన్నది వేచి చూడాల్సిన విషయం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page