top of page

మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాధ మృతదేహానికి అంత్యక్రియలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 22, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ సంస్థ సభ్యులు ఈరోజు ఒక అనాధ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు, వివరాల్లోకి వెళితే జమ్మలమడుగు మండలం వేపరాల గ్రామానికి చెందిన తిప్పబతిన జైనాథ్ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు, కాగా మృతదేహానికి అంత్యక్రియలు జరుపటానికి అతని బంధువులు ఎవరూ ముందుకు రాకపోవటం వలన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ మోరె లక్ష్మణ్ రావు సంస్థ సభ్యులు స్థానిక ప్రొద్దుటూరు లోని స్మశాన వాటికలో సంప్రదాయబద్ధముగా అంత్యక్రియలు నిర్వహించారు, మానవతా స్వచ్చంద సంస్థ సభ్యులు అంత్యక్రియలకు ఉచితముగా వైకుంఠ రధము పంపగా, పై కార్యక్రమంలో లక్ష్మణ్ రావు, మల్లికార్జున, ప్రెసిడెంట్ శివసాయి నాధ్, అశోక్, చంద్ర పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page