top of page

ముగ్గురు మట్కా బీటర్ల అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 29, 2022
  • 1 min read

వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఒకటవ పట్టాన పోలీసు స్టేషన్ పరిధిలో ఈరోజు ముగ్గురు మట్కా బీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు, వివరాల్లోకి వెళితే ఈరోజు సాయంత్రం స్థానిక ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్కు దగ్గర షేక్ మహమ్మద్ గౌస్ (37 సంవత్సరాలు), తలారి మైఖెల్ బాబు (33 సంవత్సరాలు), పల్లె ప్రశాంత్ రావు (41 సంవత్సరాలు), ప్రజలకు ఒక్క రూపాయికి 80/- రూపాయలు ఇస్తామని మోసపూర్తిమయిన మాటలు చెబుతూ మట్కా రాస్తూ ఉండగా వీరందరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1,03,820/- రూపాయల నగదు ఆరు మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నామని, ఒకటవ పట్టాన పోలీస్ స్టేషన్ సీఐ NV నాగరాజు తెలిపారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page