top of page

మంత్రాలయం ఏడీఏ జమన్న గుండెపోటుతో మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 16, 2022
  • 1 min read

మంత్రాలయం వ్యవసాయ శాఖ ఏడీఏ జమన్న గుండె పోటుతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి, వై. ధరణీ రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు జి. భీమిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ మండలి సభ్యులు కురువ మల్లికార్జున, ఆయన మృతికి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా పెద్దాయన గౌరవనీయులు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, రైతుల సమస్యలు పరిష్కారించడంలో ఏడీఏ జమన్న కృషి మరువలేనిదని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page