top of page

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం - మంజుల పత్తిపాటి

  • Writer: EDITOR
    EDITOR
  • 16 minutes ago
  • 1 min read

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం - మంజుల పత్తిపాటి

యుద్ధపు నీడలో ఊరు దూరమై పోతే...

శాంతి వెతుకుతూ అడుగు ముందుకు వేస్తే…

చూడండి వారి కళ్లలో దాగిన కథలు..!

వినండి ఆ నిశ్శబ్దంలో ఉన్న వ్యథలు…!

కలలన్నీ కాలిపోయి మిగిలిన ఒంటరి డొక్కలను

ఎందుకు అర్థం చేసుకోదు ఈ సరిహద్దులు రేఖలు..?

ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల ఆర్తనాదాన్ని ఎందుకు అర్థం చేసుకోవు ఈ సరిహద్దులు రేఖలు..?

సహాయం చేయడం కేవలం దానం కాదు,

మనిషి మనిషిగా నిలవడం..!

ఒక గుండె విరిగిన కథ ఇది..!

ఒక తల్లి మౌనం వెనుక దాగిన వేదన సత్యం ఇది..!

ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల చప్పుడు

మనసు తడిపే కన్నీటి నిశ్శబ్ద గానం విని

మంజుల పత్తిపాటి కలం చెబుతుంది

మనిషి కోసం మనిషి నిలవాలి అని


రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, చరవాణి 9347042218


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page