top of page

మండల పూజలో చిన్నారాయల్ అన్నదానం.

Writer: DORA SWAMY
DORA SWAMY
Nov 15, 2023
1 min read

మండల పూజ సందర్భంగా అన్నదానం.

చిట్వేలి మండలం రాజుకుంట పంచాయతీ అశోక్ నగర్ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంచే నిర్మించిన లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల దేవస్థానం నందు గ్రామస్తులు 40 రోజుల మండల పూజా కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించి హరే రామ భజనలతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజకుంట గ్రామ నివాసి రామచంద్రయ్య కుమారుడు వైసిపి యువ నాయకులు మాదినేని చిన్నా రాయల్ దేవాలయం దగ్గర గ్రామ ప్రజలకు షడ్రుచులతో కూడిన అన్నదానం నిర్వహించారు. దైవ కార్యక్రమ సేవ లో భాగస్వామి కావడం సంతృప్తినిచ్చిందని చిన్నా రాయల్ అన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షుడు వైసిపి నాయకులు యన్నారు కిషోర్ కుమార్, చెర్లోపల్లి గ్రామ సర్పంచ్ ఓబినేని ఈశ్వరయ్య,ఆనంగి నరసయ్య, మాదినేని రాజా, ఎం దేవా, అశోక్ నగర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page