top of page

మేకతో యువకుడి పెళ్లి... మరి శోభనం?

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 3, 2022
  • 1 min read

కృష్ణ జిల్లా, నూజివీడు

ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నా ఏదో ఒక చోట ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిష్యం పేరుతో వింత పోకడలకు పోతున్నారు. జాతకం ప్రకారం ఓ యువకుడి జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉందని.. దోష నివారణ కోసం మేకతో పెళ్లి జరిపించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో జరిగింది.

నూజివీడుకు చెందిన ఓ యువకుడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నారు. అతడి జాతకాన్ని పరిశీలించేందుకు జోతిష్యుడిని సంప్రదించారు. ఆ కుర్రాడి జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని ఉందని ఆయన వారికి వివరించారు. ఆ దోషం పోవాలంటే మేకను మనువాడితే సరిపోతుందని సూచించాడు. దీంతో జాతకాలపై నమ్మకమున్న ఆ యువకుడు మేకతో వివాహానికి రెడీ అయిపోయాడు.


నూజివీడు పట్టణ పరిధిలోని నవగ్రహ ఆలయంలో ఈ కుర్రాడికి మేకతో పెళ్లి జరిగింది. ఉగాది రోజున అర్చకులు యువకుడితో శాస్త్రోక్తంగా మేక మెడలో మూడుముళ్లు వేయించారు. మేకతో మొదటి వివాహం అయిపోయింది కాబట్టి.. ఇక పెళ్లి చేసుకున్నా ఇబ్బంది ఉండదని యువకుడు భావిస్తున్నాడు. స్థానికులు మాత్రం మేకతో పెళ్లా అంటూ ఆశ్చర్యపోయారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page