top of page

ఆమ్మను కామెంట్ చేశాడని వెంటాడి చంపాడు...

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 28, 2022
  • 1 min read

అమ్మను కామెంట్ చేసిన వ్యక్తిని వెంటాడి చంపి


డెడ్‌బాడీ తీసుకొచ్చి తల్లి కాళ్లముందు పడేశాడు సందుగొందుల్లో తరిమి తరిమి కొట్టాడు


అక్కడ బండరాయితో మోది చంపడం మాత్రమే కాదు.. ఆ డెడ్ బాడీని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చాడు


అంత కసిగా ఈ హత్య జరగటానికి గల కారణాలేంటి?

విశాఖపట్నం, అల్లీపురం ప్రాంతం, ఆదివారం ఉదయం 5 గంటల 55 నిమిషాల సమయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. గొంతిన శీను అనే ఒక పెయింటర్ మద్యం మత్తులో ఉన్నాడు. ఇంతలో అటుగా వచ్చింది గౌరి అనే వివాహిత. తన పాటికి తాను పనికి వెళ్తోందా మహిళ. ఇంతలో మద్యం మత్తులో ఉన్న శ్రీను ఆమెను కామెంట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగిందని, ఇరువురి మధ్య తోపులాట సాగిందనీ.. ఈ క్రమంలో తీవ్రంగా బాధ పడ్డ మహిళ.. తన కొడుక్కి సమాచారం ఇచ్చిందనీ చెబుతున్నారు ప్రత్యక్ష సాక్ష్యులు. తన తల్లిని అనడం మాత్రమే కాక.. వాగ్వాదానికి దిగి- తోపులాటకు పాల్పడ్డ శ్రీనును అల్లీపురం సందుగొందుల్లోకి తరుముకుంటూ వెళ్లాడు యువకుడు. అక్కడే అతడిని బండరాయితో మోది చంపాడు. అంతే కాదు..రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి మరీ తన తల్లి ముందర పడవేసాడు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page