top of page

రైలు క్రింద పడి యువకుడు ఆత్మహత్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 9, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్. కడప జిల్లా, యర్రగుంట్ల మండలం ఎర్రగుంట్ల కలమళ్ళ రైల్వే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి చనిపోయాడు మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది, కాగా ఎర్రగుంట్ల సి.ఆర్.పి.ఎఫ్ పోలీసులు కలమల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు, ఈ మేరకు కలమల్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మృతుడి ఊరు, పేరు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాలిసి ఉంది.


గుర్తు తెలియని విద్యార్థిగా గుర్తించిన పోలీసులు ఎవరైనా తెలిసిన వారు ఉంటే పోలీసులకు తెలియజేయవలసిందిగా రైల్వే ఎస్.ఐ వర్మ తెలిపారు, మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించిన రైల్వే పోలీసులు. రేపు మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని వారి బంధువులు వారి మిత్రులు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా తెలిపిన రైల్వే ఎస్సై వర్మ


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page