top of page

ఇంటింటికి తెలుగుదేశం: ప్రొద్దుటూరులో అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన మల్లెల లింగా రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 6 days ago
  • 1 min read

ఇంటింటికి తెలుగుదేశం: ప్రొద్దుటూరులో అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన మల్లెల లింగా రెడ్డి

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు


"ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా నేడు ప్రొద్దుటూరు టౌన్ జమ్మలమడుగు రోడ్డులోని అన్నా క్యాంటీన్‌ను మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగా రెడ్డి సందర్శించారు. క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న పేద ప్రజలతో ముచ్చటించిన ఆయన, భోజనం నాణ్యత, రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు భోజనం చాలా బాగుందని, రుచికరంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లింగా రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని, రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.


కూటమి నేతలు, కార్యకర్తల భాగస్వామ్యం


ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ కామిశెట్టి బాబు, మాజీ కౌన్సిలర్ *రామసంజీవ రెడ్డి, ప్రొద్దుటూరు పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు శామీర్ భాషా తో పాటు టప్పా మహబూబ్ భాష, ఎన్టీఆర్ సిద్దయ్య, జిల్లెళ్ళ వెంకటేష్, రాము నాయుడు, కదిరి రామకృష్ణారెడ్డి, ద్వార్శల వెంకటరెడ్డి, గంగుల రంగారెడ్డి, గిద్దలూరు ఈశ్వరయ్య, మహమ్మద్ రఫీ, సుబ్బయ్య, క్రిష్ణయ్య, షేక్షా వల్లీ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం దోహదపడుతుందని నేతలు పేర్కొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page