మహా పాదయాత్రకు అడుగడుగునా ఆటంకం
- VOICE OF HERALD

- Feb 26, 2022
- 1 min read
కడప జిల్లా, రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేడు తలపెట్టిన మహాపాదయాత్ర పాదయాత్రకు పెద్ద ఎత్తున టీడీపీ బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొనగా అడుగడుగునా ఆటంకం ఎదురయింది, పోలీసులు ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేయగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు పాదయాత్రలో పాల్గొన్న ప్రజలు, రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని గత కొద్ది రోజుల నుండి ఇక్కడి ప్రజలు స్వచ్చందంగా క్యాండల్ ర్యాలీలు కూడా చేపట్టారు, ఇది ఇలా ఉండగా నేడు మహా పాదయాత్ర పేరుతో రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని రాజంపేట నుండి కడప వరకు చేపట్టిన పాదయాత్రలో నాయకులను పోలీసులు అరెస్ట్ చేయటం ఏంటని చంగలరాయలు ప్రశ్నించారు, కార్యకర్తలు తమని కూడా అరెస్ట్ చేయమని మన్నూరు పోలీసు స్టేషన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు, లేని పక్షంలో తమ నాయకులను వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఎంతసేపటికి తమ నాయకులను పోలీసులు విడిచిపెట్టని కారణంగా ప్రజలే స్వచ్చందంగా మహా పాదయాత్రను మన్నూరు పోలీసుస్టేషన్ వద్ద నుండి ప్రారంభించారు. ప్రస్తుతానికి మహా పాదయాత్ర కడప వైపుగా కొనసాగుతోంది.



Comments