top of page

చనిపోయిన ఆగని రుణ యాప్ ల వేధింపులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 12, 2022
  • 1 min read

చనిపోయిన ఆగని రుణ యాప్ ల వేధింపులు.


రుణ యాప్ ల వేధింపులకు వివాహిత బలి.


మంగళగిరి మండలం చినకాకాని కి చెందిన బండ పల్లి ప్రత్యుష (24) సోమవారం తెల్లవారుజామున ఇంటి పైన ఇనుప ఫ్లెక్సీ ప్రేమ్ కు చీర తో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. ఆత్మహత్య కు ముందు తల్లిదండ్రులు, భర్త కు సెల్ఫీ వీడియో పంపిన ప్రత్యుషా, మృతురాలు పుట్టినిల్లు మచిలీపట్నం శారదా నగర్. కృష్ణా జిల్లా గంటశాల మండలం సెకెనేపల్లి కి చెందిన భర్త రాజశేఖర్ ఏపీఐసీసీ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నారు.

6 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, చినకాకని హైలాండ్ రోడ్ లో నివాసం ఉంటున్నారు.

మృతురాలు ప్రత్యుషా ఇటీవల ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్ ఎమ్ రుణ యాప్ లో 20 వేలు లోన్ తీసుకోగా 8 వేలు బకాయి ఉంది. రెండు రోజుల నుండి ఆమె కు రుణ యాప్ ల కాల్ సెంటర్ నుండి వేధింపులు. న్యూడ్ ఫోటోలు నీ కాంటాక్ట్ నంబర్స్ కు పెడతామని బెదిరింపులు. తీవ్ర మానసిక వేదన కు గురి ఐనా ప్రత్యుషా ఆత్మహత్య కు పాల్పడింది.


ప్రత్యుషా ఆత్మహత్య కు పాల్పడిన ఉదయం నుండి ఆమె కు ఫోన్, వాట్సాప్ ద్వారా ఆగని వేధింపుల కాల్స్. ఆమె సెల్ వాట్సాప్ కాంటాక్ట్స్ కు ఆమెను అసభ్యంగా కించపరుస్తూ సందేశాలు పంపిన రుణ యాప్ నిర్వాహకులు. 9745211357 సెల్ నెంబర్ నుండి ఆగని వేధింపులు.ఆగకుండా వస్తున్న కాల్స్ ఎత్తిన భర్త రాజశేఖర్ కు వీరబాబుయడ్ల@వైబిఎల్ లింక్ ద్వారా బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. భర్త రాజశేఖర్ పిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page