ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ 17వ వర్ధంతి : ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ 17వ వర్ధంతి : ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

కడప జిల్లా, ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహానేత సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ సజీవంగానే ఉంటారని పేర్కొన్నారు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన పనులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.




Comments