top of page

అపార్ట్మెంట్ పైనుండి దూకి వివాహిత ఆత్మహత్య - ప్రొద్దుటూరు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 25, 2022
  • 1 min read

Updated: Feb 26, 2022


వివాహిత మృతి

కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ సాయిసుధ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కిరణ్మయి(35) అనే వివాహిత మృతి చెందినట్లు త్రీటౌన్ ఎస్ఐ రాజగోపాల్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డకు చెందిన కిరణ్మయికి ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ కుమార్ రెడ్డితో 10సంవత్సరాల క్రితం వివాహం జరిగిందన్నారు. సునీల్ కుమార్ రెడ్డి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూ, ప్రస్తుతం 2 సంవత్సరాలుగా ఇంటి వద్ద నుండే విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. వారికి 8 సంవత్సరాల కుమారుడు ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయ కిరణ్మయి బట్టలు ఆరేసుకోవడానికి అని అపార్ట్మెంట్ పైకి వెళ్లి కాలుజారి క్రింద పడి మృతి చెందినట్లు కిరణ్మయి తండ్రి నూక రామసుబ్బారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page