top of page

చలో కలెక్టరేట్ గురువారం 27వ తేది కెవిపిఎస్

Writer: EDITOR
EDITOR
Aug 23
1 min read

చలో కలెక్టరేట్ గురువారం 27వ తేది కెవిపిఎస్ - సిఐటియు ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం కరపత్రాలు పంపిణీ చేశారు

జివియంసి గాజువాక జోన్ 66వ వార్డు కొత్త గాజువాక కూరగాయల మార్కెట్ లైన్ ఇందిరా కాలనీ లో ఉన్న దళిత కుటుంబాలను కలిసి కుల వివక్ష లేని సమాజం కోసం కదలిరండి ఈనెల 27 తేది ఉ,. 10 గం,. చలో కలెక్టరేట్ కార్యక్రమం జయప్రదం చేయండి అని జివియంసిలో కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ వర్కర్స్ దళితుల కార్మికులకు గొలగాని అప్పారావు, ఎం. రాంబాబు పిలుపునిచ్చారు. ఇంటింటా సర్వే చేశారు. వార్డు పారిశుద్ధ్యం కార్మికుల విస్తృత సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, దళిత బంధువులు, సంఘాల కార్మికులకు తల్లికి వందనం స్కీం అమలు చేయాలి 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ అమలు చేయాలి దళితుల స్మశాన సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో 1235 అమలు చేయాలి కులాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలి మతం పేరుతో వేధింపులు ఆపాలి దళిత పేటల్లో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలు పునరుద్ధరించాలి ఎస్సీ ఎస్టీ అత్యాసార కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ పెత్తందారుల కొమ్ముకాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలి పిల్లల ఆరోగ్య బాధ్యత తీసుకోవాలి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఎస్సి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి దళిత మహిళలను కించపరుస్తూ మాట్లాడే అహంకార భాషను అరికట్టాలి దళిత క్రైస్తవులకు ఎస్ సి హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ పునరుద్ధరించాలి అని అన్నారు. యజ్జల చిన్నారావు, గొల్ల రాము, ధనాల బాలరాజు, చందర్రావు, నక్క నాగరాజు, తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page