top of page

శభాష్ పోలీస్...

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 28, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, శ్రీశైలం పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ ప్రశంసలు. మూర్చ పోయిన భక్తురాలుకి అత్యవసర సాయం అందించిన శ్రీశైలం పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఆదివారం శ్రీశైలానికి దర్శనానికి వచ్చి రద్దీ వలన ఓ భక్తురాలు మూర్చ పోయింది.

అత్యవసర పరిస్ధితులలో ఎమర్జన్సీ గేట్ లాక్ బ్రేక్ చేసి భక్తురాలిని దేవస్ధానం హాస్పిటల్ కు తీసుకెళ్ళి డాక్టర్ల చే సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునే విధంగా చేసిన శ్రీశైలం వన్ టౌన్ ఎస్ఐ వెంకట్ రెడ్డి, శ్రీశైలం 2 టౌన్ కానిస్టేబుల్స్ మద్ది లేటి, నాను నాయక్ మరియు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ అభినందించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page