top of page

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Oct 2, 2024
1 min read

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


స్వచ్ఛతా హి సేవా 2024 కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీన మొదలై అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాడు ముగిసిన నేపథ్యంలో, కొత్తపల్లి పంచాయతీ సెక్రెటరీ నరసింహులు ఆధ్వర్యంలో పంచాయతి పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి శాలువా కప్పి పూలమాల వేసి పలు నిత్యావసరాలు వారికి అందించి సన్మానించారు. అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ కార్యక్రమం నేటితో పది సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఇందులో భాగంగానే సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం తమ పంచాయతీ పరిధిలో నిర్వహించి పారిశుధ్య సమస్యలు, పరిసర ప్రాంతాల శుద్ధి నిర్వహించిన తమ పారిశుధ్య కార్మికులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నాడు కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడి అభినందించారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యాలయ సిబ్బంది, పలువురు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page