13వ వార్డు మెంబర్ గా కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గెలుపు
- VOICE OF HERALD

- Aug 19, 2023
- 1 min read
13వ వార్డు మెంబర్ గా కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గెలుపు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
శనివారం ఉదయం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని 13వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో కుక్కర్ గుర్తుపై బరిలోకి దిగిన కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి పేరం బ్రహ్మానంద రెడ్డి పై 48 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉదయం నుంచి పలు నాటకీయ పరిణామాలు పోలింగ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకోగా, ఆందోళనలు, గొడవలు జరగవచ్చన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఏఎస్పి ప్రేరణకుమార్ ఐపీఎస్ నేతృత్వంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయగా, ఎక్కడ ఎటువంటి గొడవలు అమాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి చెదురుమదురు సంఘటన కూడా జరగలేదు. జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠత రేపిన కొత్తపల్లి పంచాయతీ 13 వ వార్డు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, తనను ఆదరించి, తనపై తన తండ్రి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పై విశ్వాసం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన 13వ వార్డు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.







Comments