కొత్తపల్లిలో పంచాయితీలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం!

కొత్తపల్లిలో పంచాయితీలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం!

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి గారి సమర్థవంతమైన నాయకత్వంలో, మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్థానిక ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులోని కొత్తపల్లి కాలువ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
డ్రైనేజీ సమస్యలకు చెక్...
గతంలో కేవలం రెండు అడుగుల లోతు మాత్రమే ఉన్న ఈ కాలువను, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏకంగా 10 అడుగుల లోతు వరకు తవ్వించారు. దీనివల్ల వర్షాకాలంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నుంచి వచ్చే మురుగు, వర్షపు నీరు ఎక్కడా నిలవకుండా సజావుగా ప్రవహిస్తుంది. ఫలితంగా గ్రామంలో ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
అభినందనల వెల్లువ...
పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలే పరమావధిగా శ్రమిస్తూ, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి వైఖరిపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి ఆయన చూపిస్తున్న చొరవను కొనియాడుతూ అభినందనలు తెలియజేస్తున్నారు.





Comments