వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కొనిరెడ్డి రాజీనామా
- VOICE OF HERALD

- Mar 29, 2024
- 1 min read
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కొనిరెడ్డి రాజీనామా


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అసమ్మతి నేతగా ముద్రపడ్డ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన రాజీనామా పత్రాన్ని కడపలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేయర్ సురేష్ బాబుకు అందజేశారు. రాజీనామా లేఖ సారాంశం ప్రకారం గడచిన కొద్ది దశాబ్దాల కాలంగా వైయస్ కుటుంబానికి తాను విధేయుడుగా ఉంటూ, రాజశేఖర్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ పార్టీకి, ఆయన మరణానంతరం ఆయన తనయుడు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కి విధేయుడుగా ఉంటూ, తాను కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైనట్లు, ఈ క్రమంలో జరిగిన కొన్ని పరిణామాలు, వార్డ్ మెంబర్లకు కొనుగోళ్లు, వర్గ విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లను విభేదిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ లేఖలో పొందుపరిచారు. శనివారం నియోజకవర్గానికి రానున్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు స్పష్టమవుతోంది.








Comments