top of page

కొనిరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి విజయోత్సవ సంబరాలు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jun 6, 2024
1 min read

కొనిరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి విజయోత్సవ సంబరాలు

కొనిరెడ్డిని సన్మానిస్తున్న టిడిపి శ్రేణులు అమృత నగర్ వాసులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మ్రోగించగా, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి 22744 ఓట్ల ఆదిత్యంతో గెలుపొందిన నేపథ్యంలో ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ అమృత నగర్ 2 వాసులు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ని ఘనంగా సన్మానించారు. గురువారం సాయంత్రం కొనిరెడ్డిని అమృత నగర్ కు ఆహ్వానించి భారీ ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో సన్మానం నిర్వహించిన అనంతరం భారీ కేకును కట్ చేయించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు హాజరు కాగా, అమృత నగర్ వాసులు వారికి సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కొనిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలలో శక్తివంచన లేకుండా టిడిపి గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమృత నగర్ నందు టిడిపిని ఆదరించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జిబిఉల్లా, కౌన్సిలర్ మునీర్, టిడిపి యువ నాయకులు కోనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డి, జింకా రమణ మూర్తి, జంబాపురం ఆంజనేయులు, బద్వేలు వాసు, మాజీ జెడ్పిటిసి వెళ్లాల భాస్కర్, గాలిపోతుల సుదర్శన్, పలువురు కార్యకర్తలు, అమృత నగర్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page