top of page

భార్యను బావమరిదిని మరో మహిళను కత్తితో తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 21, 2022
  • 1 min read

కత్తితో భార్యను తీవ్రంగా గాయపరిచిన భర్త అడ్డొచ్చిన బావమరిదితో పాటు మరో మహిళకు కత్తి గాయాలు.

కోనసీమ జిల్లా, మండపేట మండలంలోని వేములపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన పల్లా శ్రీలక్ష్మి కి కరప మండలం పెనుగుదురుకు చెందిన పల్లా వీరబాబు తో వివాహమైంది, వీరికి ఇద్దరు సంతానం. వీరబాబు అదనపుకట్నం కోసం వేధిస్తుండటంతో, శ్రీలక్ష్మి వేములపల్లి లోని అన్న వద్ద వుంటుంది. ఈ నేపథ్యంలో భర్త పల్లా వీరబాబు వేములపల్లి వచ్చి కత్తితో భార్య పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో అడ్డు వచ్చిన బావమరిది నర్ల శ్రీరామ్ కు మరో మహిళకు కత్తి గాయాలు అయ్యాయి, తీవ్రంగా గాయపడిన శ్రీ లక్ష్మి ని బావమరిది శ్రీరామ్ ను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త వీరబాబు పరారీలో ఉన్నాడు, ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page