top of page

జనసేన ఆధ్వర్యంలో KNOW MY CONSTITUENCY

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jan 8, 2022
1 min read

జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం.

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన KNOW MY CONSTITUENCY. కార్యక్రమం లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం లోని NTR నగర్ లో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.


మఖ్యంగా త్రాగునీరు ,డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, ఇళ్ళపట్టాలు, నిత్యావసర ధరల విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు పూట గడవడం కూడా కష్టంగా ఉందని తెలియజేశారు. ప్రజల సమస్యలను మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టరు ద్రుష్టి కి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని వినుత ప్రజలకు బరోసా ఇవ్వడం జరిగింది.


ఈ కార్యక్రమం లో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు రాఘవయ్య, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్, నాయకులు మణికంఠ,ప్రమోద్,సురేష్, నితీష్, కిషోర్, చందు, గిరీష్,మునిసేఖర్, జనసైనికులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page