top of page

రాష్ట్ర వాలీబాల్ బాలుర జట్టు కోచ్ గా కిషోర్ ఎంపిక.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 27, 2023
  • 1 min read

రాష్ట్ర వాలీబాల్ బాలుర జట్టు కోచ్ గా కిషోర్ ఎంపిక.

--చిట్వేలి మండల ప్రజలు హర్షం.

వెస్ట్ బెంగాల్ లోని చందేరి నాగూర్ నందు మే 28 తారీకు నుంచి జూన్ 1 వరకు కొనసాగే 45వ జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కు ఏపీ రాష్ట్రం నుంచి పాల్గొనే బాలుర జట్టుకు కోచ్ గా చిట్వేలి గ్రామ పరిధిలోని పాత చిట్వేలు నివాసైన బాలరాజు కిషోర్ కుమార్ ఎంపికైనట్లు తాను "ప్రసన్న ఆంధ్రకు" తెలిపారు. మే నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈస్ట్ గోదావరి జిల్లా నందు ఈ జట్టుకు ముందస్తు ప్రాక్టీస్ నిర్వహించినట్లు తెలిపారు.


ఎంపికైన జట్టుతో కోచ్ కిషోర్

తనను కోచ్ గా ఎంపిక చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర జట్టు గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తానని కిషోర్ తెలియపరిచారు. కిషోర్ కోచ్ గా ఎంపికవ్వడం పట్ల చిట్వేలు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page