top of page

కిలాడీ లేడీ వలలో పెళ్లి కొడుకులు

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 4, 2023
  • 1 min read

కిలాడీ లేడీ వలలో పెళ్లి కొడుకులు

పెళ్లి పేరుతో పలువురు యువకులను పెళ్లి చేసుకొని, కొద్ది నెలలు కాపురం చేసినట్లు నటించి, లక్షలాది రూపాయల నగదు, బంగారంలో యువతి పరారవుతున్న సంఘటన ఎన్టీపీసీ రామగుండంలో వెలుగు చూసింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన పెంట అనూష మ్యాట్రిమోన్లో యువకులకు పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతుందని బాధితుడు సుద్దాల వేణు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


తనకు పెంట అనూష గత సంవత్సరం మాట్రిమోన్లో పరిచయం అయిందని, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో అప్పుడే తనకు డబ్బులు అవసరం ఉందని తెలపడంతో రెండు లక్షల రూపాయలు ఆన్‌లైన్ ద్వారా పంపించాలని తెలిపిందని వేణు ఫిర్యాదులో తెలిపాడు.


రెండు నెలలు తనతో పాటు ఉండి చెప్పకుండానే వెళ్లిపోయిందని తనతో మళ్లీ కాపురానికి రావాలని ఫోన్ ద్వారా సంప్రదించగా హైదరాబాద్‌లో ఉన్న అక్కడికి రావాలని తెలిపిందని వేణు పేర్కొన్నాడు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page