top of page

కమలాపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 3, 2022
  • 1 min read

వైయస్సార్ జిల్లా


పోలీసు స్టేషన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే. 👉కమలాపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. పలు రికార్డులతో పాటు జనరల్ డైరీ ని స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. 👉స్టేషన్లో మెన్ కొరతా ఉందని తెలిసి జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు చరవాణి లో మెన్ కొరత లేకుండా చూడాలని తెలిపిన ఎమ్మెల్యే. స్టేషన్లో 19 మంది మెన్ ఉండాల్సి ఉండగా 11 మంది మాత్రమే ఉంటూ అందులో ఐదు మంది అటాచ్ లో వున్నారు.

యర్రగుంట్ల రూరల్ సిఐ కమలాపురం హెడ్ క్వార్టర్ లో ఉండేటట్లుగా చూడాలని ఎస్పీ కి తెలిపిన ఎమ్మెల్యే. కమలాపురం పోలీస్ స్టేషన్ ఒక మోడల్ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతానన్న ఎమ్మెల్యే. కమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తన సొంత నిధులతో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తానన్న ఎమ్మెల్యే.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page