విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పోతురాజు గడ్డ కలశాభిషేకం
- VOICE OF HERALD

- Aug 6
- 1 min read
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పోతురాజు గడ్డ కలశాభిషేకం

ప్రొద్దుటూరు, ఆగస్టు 6: విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వర్షాభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం ప్రొద్దుటూరులోని పోతురాజు గడ్డ వద్ద ఆగస్టు 8, శనివారం ఘనంగా కలశాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, కరువు, ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని సంకల్పించి ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక విశ్వాసం ప్రకారం 108 కలశాలతో పోతురాజు గడ్డకు జలాభిషేకం నిర్వహిస్తే ప్రకృతి ప్రసన్నమై సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, గ్రామాలు, పట్టణాలు సుభిక్షంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఆగస్టు 8 శనివారం ఉదయం 6.30 గంటలకు స్థానిక శివాలయం వద్ద మహిళలు, భక్తులు సమీకరించగా, ఉదయం 7.00 గంటలకు అక్కడి నుంచి మెయిన్ బజార్ మీదుగా పోతురాజు గడ్డ వరకు 108 కలశాలతో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు, అనంతరం పోతురాజు గడ్డ వద్ద జలాభిషేకం, శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం, అనంతరం తీర్థప్రసాద పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో మహిళలు, యువత, భక్తులు, కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు, పోతురాజు గడ్డ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.






Comments