top of page

కబడ్డీ పోటీలలో విజయం సాధించిన పాలిటెక్నిక్ కళాశాల జట్టు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 5, 2023
  • 1 min read

కబడ్డీ పోటీలలో విజయం సాధించిన పాలిటెక్నిక్ కళాశాల జట్టు

ప్రొద్దుటూరు నియోజకవర్గ యువ నాయకులు భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీలలో పాలిటెక్నిక్ కళాశాల జట్టు విజయం సాధించగా, రన్నర్ గా శ్రీవిద్య కాలేజీ జట్టు నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక వైఎమ్ఆర్ కాలనీ లోని స్కాలర్స్ పాఠశాల నందు ఉదయం యెనిమిది గంటలకు యువ నాయకులు భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించారు. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని మొత్తం 20 కబడ్డీ జట్టు పోటీలలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలలో విజయం సాధించిన పాలిటెక్నిక్ కళాశాల జట్టుకు గోల్డ్ మెడల్ ట్రోఫీని ఆయన అందించారు, రన్నర్స్ గా నిలిచిన శ్రీవిద్య జూనియర్ కాలేజ్ జట్టుకు సిల్వర్ మెడల్ బహూకరించారు. పోటీలలో నిలిచి విజయం సాధించిన జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కబడ్డీ పోటీలలో యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page