ప్రొద్దుటూరు 41వ వార్డులో కాంగ్రెస్‌లో చేరికలు
- VOICE OF HERALD

- 5 days ago
- 1 min read
ప్రొద్దుటూరు 41వ వార్డులో కాంగ్రెస్‌లో చేరికలు

ప్రొద్దుటూరు | 12 ఆగష్టు 2026
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 41వ వార్డుకు చెందిన వెంకట సుబ్బయ్య తన కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి, ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా విజయజ్యోతి మాట్లాడుతూ, "కాంగ్రెస్ పార్టీ పేదలు, సామాన్య ప్రజల పార్టీ" అని, రాజ్యాంగ స్ఫూర్తితో అందరినీ సమానంగా గౌరవిస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తుందని అన్నారు. "కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, వైఎస్ షర్మిలా రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యల కోసం ఇర్ఫాన్ బాషాను సంప్రదించాలని, ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. చేనేత వర్గానికి చెందిన వారు సంక్షేమ పథకాలు అందడం లేదని విన్నవించగా, సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని విజయజ్యోతి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు గొసంగి సుబ్బారెడ్డి, మైనారిటీ నాయకులు షేక్ మౌలాలి, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.





Comments