వారాహి యాత్రకు లైన్ క్లియర్
- EDITOR

- Jun 12, 2023
- 1 min read
వారాహి యాత్రకు లైన్ క్లియర్..
సెక్షన్ 30 యాక్ట్ అమలుపై క్లారిటీ!


జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడానికే ఆంక్షలు విధించామని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు అమలాపురం ఎస్పీ. సెక్షన్ 30 యాక్ట్.. సాధారణ విధుల్లో భాగమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకించి జనసేన సభల కోసం పెట్టింది కాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత.. పవన్ కల్యాణ్ సభ జరిగే ప్రాంతాన్ని..జనసేన నేతలతో కలిసి అమలాపురం డిఎస్పీ పరిశీలించారు. అంతేకాకుండా.. వారాహి యాత్ర రూట్ మ్యాప్‌ను కూడా పరిశీలించారు. పోలీసులే స్థానిక జనసేన నేతలతో మాట్లాడటంతో.. ఆంక్షల వివాదం సద్దుమణిగింది.





Comments