ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: జనసేన కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు

ప్రొద్దుటూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: జనసేన కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు

వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
పట్టణంలోని నందిని క్లాత్ మార్కెట్ వద్ద గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మాదాసు మురళి, అల్లం చంద్రశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాదాసు మురళి మాట్లాడుతూ, సినీ రంగం నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి తన సిద్ధాంతాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జనసేనకు కేటాయించిన స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అహర్నిశలు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ సీనియర్ నేతలు అల్లం చంద్రశేఖర్, దేవానంద్, జనసైనికులు వరికోటి నాగార్జున, జోడు అఖిల్, వంశీ రెడ్డి, మహమ్మద్, హరీష్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





Comments