top of page

ఓటర్ల వివరాల కోసం ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌కు జనసేన పార్టీ వినతి

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 10
1 min read

ఓటర్ల వివరాల కోసం ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌కు జనసేన పార్టీ వినతి

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో వార్డుల విభజన, ఎస్ఐఆర్ విభజన అనంతరం ఏర్పడిన 52 వార్డులకు సంబంధించిన పోలింగ్ బూత్‌ల వారీ ఓటర్ల నివేదికతో పాటు పురుషులు, మహిళలు, కులాల వారీ ఓటర్ల సమగ్ర జాబితాను అందజేయాలని జనసేన పార్టీ స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ టి. విశ్వనాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించి, వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కమిషనర్‌కు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు సమన్వయ కమిటీ సభ్యులు రామారావు, తలమాపురం శివకుమార్, మాదాసు మురళి, బాబ్జి, సుంకర మురళి, రామోజీ ప్రసాద్ పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page