top of page

“డిస్టిలరీల గురించి మాట్లాడే వారికి DSC గురించి ఏం తెలుసు?” - జనసేన నేత మాదాసు మురళీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 6 days ago
  • 1 min read

“డిస్టిలరీల గురించి మాట్లాడే వారికి DSC గురించి ఏం తెలుసు?” - జనసేన నేత మాదాసు మురళీ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష వైస్సార్‌సీపీ నాయకులు డీఎస్సీ నియామకాలపై రాద్ధాంతం చేస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళీ తీవ్రంగా విమర్శించారు. నందిని క్లాత్ మార్కెట్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


డీఎస్సీ జరిగి 7 నెలలు అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఉద్యోగ నియామకాలపై వివాదాలు సృష్టించడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే అన్నారు. “ప్రజలకు ఉపయోగపడే పరిపాలనను చూసి ఓర్వలేకనే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. నిరుద్యోగ యువత పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలను చెప్పాలన్నారు, లేని సమస్యలు సృష్టించి యువతను తప్పుదోవ పట్టించవద్దు” అని ఆయన హితవు పలికారు.


ప్రజలు అన్నీ గమనిస్తున్నారు - మాదాసు మురళీ


వైస్సార్‌సీపీ నాయకులు చిదిరి అప్పారావు, జోగి రమేష్ గతంలో చేసిన తప్పులను ప్రజలు మర్చిపోయేలా ఇప్పుడు డీఎస్సీ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మాదాసు మురళీ ఆరోపించారు. “ఎవరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు, ఎవరు కేవలం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడటం మానుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page