top of page

జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా మాదాసు మురళి నియామకం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Oct 12
1 min read

ప్రొద్దుటూరు జనసేన స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా మాదాసు మురళి నియామకం: కూటమి విజయమే లక్ష్యమని స్పష్టీకరణ

వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా మాదాసు మురళి నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించినందుకు ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను క్రియాశీలకంగా సమాయత్తం చేసి, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే తన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల సమరంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, కార్యకర్తలతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, 100 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి అభ్యర్థుల సంపూర్ణ విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మురళి నియామకం పట్ల నియోజకవర్గ జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page