top of page

జనసేన ఆశావహుల నుంచి వినతులు స్వీకరించిన దేవ వరప్రసాద్

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 28
1 min read

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల సమరశంఖం: జనసేన ఆశావహుల నుంచి వినతులు స్వీకరించిన దేవ వరప్రసాద్


స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణలో భాగంగా జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా ఎన్నికల సమన్వయ కమిటీ ఇంచార్జి దేవ వరప్రసాద్ ప్రొద్దుటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల పరిధిలోని జనసేన నాయకులతో ఆయన సమావేశమయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరఫున కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి ఆయన స్వయంగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా పార్టీ బలాబలాలు, సామాజిక సమీకరణాలు, ప్రతిపక్షాల వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలతో సమన్వయం చేసుకుంటూ, వార్డుల్లో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యతనిచ్చి నూరు శాతం విజయమే లక్ష్యంగా పార్టీ అధిష్టానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్ జి.వి. రమణ, కడప జిల్లా ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ పాల్గొని ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పండ్ర రంజిత్, అల్లం చంద్రశేఖర్ రాయల్, అక్కి దాసరి రామారావు, మంచి శివకుమార్, రామోజీ ప్రసాద్, మురళీకృష్ణ, శివకళ్యాణ్ రెడ్డి, మంచాల సంజీవ్, మదసు మురళి, షోయబ్, అశోక్, విజయ్, రంగస్వామి, రాము, మధు, నాగేంద్ర, లక్ష్మణ్, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page