స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వార్డులపై జనసేన ప్రత్యేక సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వార్డులపై జనసేన ప్రత్యేక సమీక్ష

కడప పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించగా, ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం వార్డుల స్థితిగతులు, జనసేన పార్టీ గెలుపు అవకాశాలపై సమగ్ర నివేదికను సమర్పించారు. కడప పార్లమెంట్ సమన్వయకర్త, రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ కు కడప పార్లమెంటు సహాయ బృందం సభ్యుడు, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త అక్కిదానరి రామారావు ప్రొద్దుటూరు పట్టణ మున్సిపాలిటీలోని వార్డుల సంఖ్య, క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలు మరియు ఏయే వార్డులలో జనసేన బలమైన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే అంశాలను కూలంకషంగా వివరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు వార్డు స్థాయి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకత్వం స్పష్టం చేసింది.






Comments