top of page

జమ్మలమడుగు లో పురి విప్పిన ఫ్యాక్షన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 27, 2022
  • 1 min read

Updated: Jul 28, 2022


వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గ పోరు

రామ సుబ్బారెడ్డి వర్గీయులపై కత్తులతో దాడి గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమం

బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు నియోజకవర్గంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నందు వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలోని మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి వర్గీయులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి మైలవరం మండలం చిన్న కొమెర్ల గ్రామం వద్ద మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి వర్గానికి చెందిన దిలీప్ రెడ్డి పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డివర్గానికి చెందిన శ్రావణ్ కుమార్ రెడ్డి కత్తులతో దాడి చేశాడు. గాయపడ్డ దిలీప్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వ్యక్తికి జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు .

అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న కొమెర్ల గ్రామంలో ఆదిపత్య పోరు నడుస్తోంది అందువల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అధికారులు వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు . లేకపోతే గ్రామంలో ఫ్యాక్షనిజం పునరాగం అయ్యే ప్రమాదం ఉందన్నారు. అధికారులు నిందితుడుని అరెస్టు చేసి కఠినమైన శిక్ష పడేలా చేయాలన్నారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ స్థాయిలో పోలీసులు ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. అంతేకాకుండా సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపడుతున్నారు. బాధితుల నుండి ఫిర్యాదు స్వీకరించి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపదుతున్నామని తలవంచి పట్నం ఎస్సై మంజునాథ తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page