top of page

మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం - జమాఅతె ఇస్లామి హింద్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 12, 2024
  • 1 min read

మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం - జమాఅతె ఇస్లామి హింద్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు జమాఅతె ఇస్లామి హింద్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం - ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే ఉద్యమం లో భాగంగా జమాఅతె ఇస్లామి హింద్ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో 13వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30ని"లకు స్థానిక పెన్నానగర్ లోని భారత్ ఫంక్షన్ హాల్ నందు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని సోమవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జమాఅత్ పట్టణ అధ్యక్షులు షఫివుల్లాహ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమాఅతె ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షులు జనాబ్ మౌలాన వలియుల్లాహ్ సయ్యది, ఫలాహి, జమాఅతె ఇస్లామి హింద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీఖ్ హాజరు కనున్నారని తెలిపారు. కావున ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఈ సభకు హాజరై సభను విజయవంతం చేయాలని వారు కోరారు. స్త్రీ లకు కొరకు ప్రత్యేక ఏర్పాటు కలదని తెలిపారు. సమావేశంలో స్థానిక జమాఅత్ అధ్యక్షులు షఫివుల్లాహ్, మీడియా కార్యదర్శి షరీఫ్, సభ్యులు మహబూబ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page