top of page

ప్రొద్దుటూరు పోతురాజు గడ్డకు 108 కలశాల జలాభిషేకం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 8
  • 1 min read

ప్రొద్దుటూరు పోతురాజు గడ్డకు 108 కలశాల జలాభిషేకం

కడప జిల్లా, ప్రొద్దుటూరు: శనివారం ప్రొద్దుటూరులో పోతురాజు గడ్డ వద్ద 108 కలశాల జలాభిషేక కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. బీజేపీ మహిళా నాయకురాళ్లు అఖిల, కుమారి, బొలిశెట్టి రెడ్డి ప్రసన్న నేతృత్వంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, శివశక్తి, ఆవోపా మరియు వివిధ హిందూ సంఘాల సహకారంతో ఈ పూజలు నిర్వహించారు. స్థానిక అగస్తేశ్వర స్వామి ఆలయం నుండి మహిళలు 108 కలశాలతో వెదుర్ల బజార్‌లోని రాముల దేవాలయం, గౌరమ్మ కట్ట, అమ్మవారి శాల మీదుగా ఊరేగింపుగా పోతురాజు గడ్డకు చేరుకున్నారు.


పోతురాజు గడ్డ వద్ద స్వామి వారికి 108 కలశాలతో జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి పూజ్య శివోహం మాతాజీ హాజరై ఆశీర్వచనాలు అందించారు. ప్రొద్దుటూరులో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు పండాలని, అంటువ్యాధులు రాకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఓంటేరు శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు పుష్పాల శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీజేపీ మహిళా నాయకురాళ్లు కృతజ్ఞతలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page