top of page

జగనన్న ఆరోగ్య సురక్ష లో ప్రతి ఒకరికి ఆరోగ్య కార్డ్ పంపిణీ

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 13, 2023
  • 1 min read

జగనన్న ఆరోగ్య సురక్ష లో ప్రతి ఒకరికి ఆరోగ్య కార్డ్ పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నందలూరు మండలం లోని అడపూరు గ్రామ పంచాయతీ కార్యాలయం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపిడిఓ సౌభాగ్యం మాట్లాడుతూ పేద ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష ఒక వరం లాంటిది అని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి ఒక కార్డ్ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఈ హెల్త్ కార్డ్ తో దేశం లో ఎక్కడ అయిన వైద్యం చేసుకునే వీలు ఉంటుందని ఆమె అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పరీక్షల కేంద్రం ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చైతన్య భారతి, డాక్టర్లు సృజన, చంద్ర శేఖర్ రెడ్డి, సి హెచ్ ఓ వెంకట నారాయణ, అడపూర్ సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు, ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page