top of page

ప్రొద్దుటూరులో రాజకీయ రగడ - రాచమల్లుపై టీడీపీ నేత ఫైర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 4
  • 1 min read

ప్రొద్దుటూరులో రాజకీయ రగడ - రాచమల్లుపై టీడీపీ నేత ఫైర్

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి పై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్ల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు చంద్రబాబు హయాంలోనే మొదలైందని, భూసేకరణ సమయంలో రైతులతో ఫిర్యాదులు చేయించింది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. "రేపో మాపో కడప స్టీల్ ప్లాంట్‌ను కూడా మేమే కట్టామని రాచమల్లు చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు" అని ఎద్దేవా చేశారు. అంతేకాదు, వైసీపీ హయాంలో ప్రొద్దుటూరులో పేదల భూములు భారీగా కబ్జా జరిగాయని, పేదల ఇళ్ల నిర్మాణంలో కమిషన్లు దండుకుని ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. మా పెద్దాయన ప్రెస్ మీట్‌పై రాచమల్లు హేళనగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.


రాజా ఫౌండేషన్ అధినేత హత్య, నందం సుబ్బయ్య హత్య కేసు వంటి అంశాలను కూడా ప్రస్తావించిన టీడీపీ నేత, అధికార బలంతోనే కేసుల నుంచి పేర్లు తప్పించుకున్నారని ఆరోపించారు. రాజా ఫౌండేషన్ హత్యను కప్పిపుచ్చేందుకు రాచమల్లు ప్రయత్నించారని, యాక్సిడెంట్ కేసులో నిందితుడిని చిన్నపిల్లాడు అని తప్పించే ప్రయత్నం సిగ్గుచేటని అన్నారు. కంటికి కనిపించే హత్యలను కూడా గుండెపోటుగా చిత్రీకరించడం వైసీపీ నేతలకే చెల్లిందని విమర్శించారు. హాజరయ్య పోలీస్ అదుపులోకి వెళ్లడంతో రాచమల్లులో భయం మొదలైందని, భూదందాలు బయటపడతాయనే వణుకుతో ఉన్నారని అన్నారు.


"జేఎస్‌డబ్ల్యూ పూర్తయ్యాక అది కూడా మేమే చేశామని ప్రచారం చేసుకుంటారా?" అని సవాల్ విసిరిన టీడీపీ నేత, రేపటి నుండి రాచమల్లు అవినీతి చిట్టాను ఆధారాలతో సహా బయటపెడతామని ప్రకటించారు. ప్రెస్ మీట్‌లు నిర్వహించి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని హెచ్చరించారు. జగన్ బాటలోనే నడుస్తూ ప్రొద్దుటూరును అవినీతిమయం చేశారని, ప్రజలు ఈసారి తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page