top of page

ప్రవీణ్ పాదయాత్ర మినీ యువఘలం - జబీవుల్లా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 17, 2023
  • 1 min read

ప్రవీణ్ పాదయాత్ర మినీ యువఘలం - జబీవుళ్ళ

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మున్సిపల్ చైర్మన్ జబీవుల్లా

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత రాష్ట్రంలో పరిణామాలు దారుణంగా మారాయని, బాబు అరెస్టు అక్రమం అంటూ రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులు కార్యకర్తలు నిరసనలు ధర్నాలు చేపట్టిన నేపథ్యంలో, ప్రొద్దుటూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరుమల పాదయాత్ర ను మినీ యువఘలం గా పోలుస్తూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ జబివుల్లా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తమ నాయకుడు తిరుమల పాదయాత్ర మొదలుపెట్టారని, ఇది ఒక మినీ యువఘలం అని, తమ నాయకునికి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో కాలికి బొబ్బులు వచ్చిన ఎక్కడ పాదయాత్ర ఆపకుండా ముందుకు సాగుతున్నారని, అడుగడుగునా ఆయనకు జనం నీరాజనం పలుకుతున్నారని అన్నారు.

ఇకపోతే రాజకీయాలు హుందాగా ఉండాలని, మంత్రి రోజా హద్దులు మీరు మాట్లాడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాబుకు మద్దతు తెలిపారని, బాబు వెంటనే తాము ఉన్నామని, ప్రవీణ్ రెడ్డి పాదయాత్ర ముగియగానే నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు. రాబోవు ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ గౌస్, పాణ్యం సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page