top of page

జబర్దస్త్‌ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌కు సీరియస్‌

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 4, 2023
  • 1 min read

జబర్దస్త్‌ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌కు సీరియస్‌

జబర్ధస్త్‌ కమెడియన్ పంచ్‌ ప్రసాద్‌ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్‌ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్‌ కమెడియన్‌ నూకరాజు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్‌ చేయాలని, అందుకు చాలా ఖర్చవుతుందని, దాతలు సాయం చేయాలని కోరాడు.

పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ అతడి యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఇందులో నూకరాజు మాట్లాడుతూ.. 'ఎన్నో ఆస్పత్రులు తిరిగాం.. అయినా ప్రసాద్‌ అన్న ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. మూడు సంవత్సరాల క్రితమే రెండు కిడ్నీలు ఫెయిలవగా అప్పటినుంచి ఆ బాధను అలాగే భరిస్తున్నాడు. ఈ కిడ్నీ సమస్య ఉన్నవారికి ఒకదాని వెనుక ఒకటి జబ్బులు వస్తూనే ఉంటాయి.

అన్న విషయంలోనూ అదే జరిగింది. వీలైనంత త్వరగా అతడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించాలని వైద్యులు చెప్పారు. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కిడ్నీ ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చవుతుంది. చేతులెత్తి వేడుకుంటున్నా.. దయచేసి మీకు తోచినంత సాయం చేయండి' అని సాయం కోసం అర్థించాడు నూకరాజు. ఈ వీడియోలో పంచ్‌ ప్రసాద్‌ ముఖానికి ఆక్సిజన్‌ మాస్కు పెట్టుకుని కనిపించాడు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page