top of page

ఇస్కాన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ‘దసరా కల్చరల్ క్యాంప్’ – ఆకర్షణీయమైన బహుమతులు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Oct 9
1 min read

ప్రొద్దుటూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ‘దసరా కల్చరల్ క్యాంప్’ – ఆకర్షణీయమైన బహుమతులు

ప్రొద్దుటూరులోని ఇస్కాన్ మందిరం (రిలయన్స్ మార్ట్ దగ్గర, కొర్రపాడు రోడ్డు) ఆధ్వర్యంలో ‘గోపాల్-ఇ-స్కూల్’ వారి దసరా కల్చరల్ క్యాంప్ నిర్వహించబడుతోందని ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం అక్టోబర్ 10, 2026 నుండి అక్టోబర్ 21 వరకు ప్రతిరోజూ ఉదయం 9:45 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరగనుంది. 1 నుండి 5వ తరగతి మరియు 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు రెండు విభాగాలుగా నిర్వహించే ఈ శిబిరంలో మంత్ర ధ్యానం, భగవద్గీత శ్లోకాలు, నీతి కథలు, యాక్టివిటీస్, ఆటలు మరియు నృత్యం నేర్పిస్తారు. శిక్షణలో పాల్గొనే ప్రతి విద్యార్థికి ఒక ఆధ్యాత్మిక కానుకతో పాటు కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ అందిస్తారు.


ఈ క్యాంప్ ప్రవేశ రుసుము రూ. 500/- గా నిర్ణయించారు. క్యాంప్ ముగింపు సందర్భంగా అక్టోబర్ 20, 2026న భగవద్గీత శ్లోకాలు (25 మార్కులు), బహుళైచ్ఛిక ప్రశ్నలు-MCQ (25 మార్కులు) విభాగాలలో మొత్తం 50 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది. రెండు విభాగాలలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 6,000/-, ద్వితీయ బహుమతిగా రూ. 3,000/-, తృతీయ బహుమతిగా రూ. 1,000/- నగదుతో పాటు 10 ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. అక్టోబర్ 25వ తేదీ ఆదివారం విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతుంది. ఆసక్తి గలవారు మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ల కోసం 8520027510, 6303474393 లేదా 9912266036 నంబర్లను సంప్రదించవచ్చు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page