top of page

అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం - ఐపీఎస్ ప్రేరణా కుమార్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 2, 2022
  • 1 min read

అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం - ఐపీఎస్ ప్రేరణా కుమార్


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

PRERANA KUMAR IPS
PRERANA KUMAR IPS

ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణా కుమార్ గణనాథుల నిమర్జన కార్యక్రమం పర్యవేక్షణలో భాగంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రేరణా కుమార్ మాట్లడుతూ ముందుగా ప్రొద్దుటూరు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియచేసారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని, అందరూ జాగ్రత్తగా వినాయక నిమజ్జన కార్యక్రమంను జరుపుకోవాలి అని ఏఎస్పీ కోరారు.

అనంతరం ప్రొద్దుటూరులో ఎన్ఫోర్స్మెంట్ ను బలంగా తయారు చేస్తామని, గుట్కా, మట్కా, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా పైన ఉక్కుపాదం మోపుతామని, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను అందరూ ఉపయోగించుకోవాలి అని, ప్రజలకు పోలీసులు పలకక పోతే సమస్యను తన దృష్టికి తీసుకురావాలని, తాను ఎల్లప్పుడూ సబ్ డివిజనల్ కకార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏఎస్పీ ప్రేరణా కుమార్ తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page