top of page

కట్టుకున్న వాడి కర్కశత్వం.. సంతానం కలగలేదని?

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 28, 2022
  • 1 min read

కట్టుకున్న వాడి కర్కశత్వం.. సంతానం కలగలేదని.. భార్య కాళ్లు చేతులు విరిచేశాడు

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. చిన్నచిన్న కారణాలకే కోపం పెంచుకుని తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న వాళ్లు, తోడ బుట్టినవాళ్లు, రక్తం పంచుకు పుట్టిన వాళ్లు.. అనే రక్త సంబంధాలకు విలువ లేకుండా చేస్తున్నారు. తమకు నచ్చకుంటే చాలు.. ఎలాంటి పని చేసేందుకైనా వెనుకాడటం లేదు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీసేస్తున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. సంతానం కలగడం లేదనే కారణంతో ఓ వ్యక్తి.. తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. తీవ్రంగా కొట్టడంతో పాటు కాళ్లు, చేతులు విరిచేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చందోలి గ్రామానికి చెందిన లాలప్ప, ఆదిలక్ష్మిల దంపతులకు ఓ కుమార్తె సంతానం. ఆమెను డోన్‌ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన రాముకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే.. పెళ్లి అయినప్పటి నుంచి తమ కుమార్తెను అత్తింటివారు వేధింపులకు గురి చేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page