top of page

నూతన సంవత్సరం సందర్భంగా గ్రామాలలో అశ్లీల నృత్యాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 4, 2022
  • 1 min read

కృష్ణా జిల్లా, వీరులపాడు మండలం కోణతాలపల్లి గ్రామంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అర్ధరాత్రి వేళ సాంఘిక నాటకం అన్ని గ్రామాల్లో ప్రచారం చేసి గుట్టుచప్పుడు కాకుండా రికార్డింగ్ డాన్స్ నిర్వహించటంతో పలు విమర్శలకు గురయ్యారు ఈ నేపథ్యంలో గ్రామంలో కొందరు సోషల్ మీడియా ద్వారా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది స్థానికంగా ఉండే పోలీస్ అధికారులు సిబ్బందితో ఘటనా స్థలం వద్దకు చేరుకొని అశ్లీల నృత్యాలు నిర్వహించే వారిని, ప్రదర్శించే వారిని అదుపులోకి తీసుకొని 13 మందిపై కేసు నమోదు చేశారు ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page