top of page

నాణ్యత నమ్మకంతోనే వ్యాపారం అభివృద్ధి. ఎమ్మెల్యే కొరముట్ల.

Writer: DORA SWAMY
DORA SWAMY
Mar 6, 2024
1 min read

నాణ్యత నమ్మకంతోనే వ్యాపారం అభివృద్ధి.

--- హోమ్ నీడ్స్ పారపోత్సవంలో ఎమ్మెల్యే కొరముట్ల.

నాణ్యతతో కూడిన వస్తువును కొన్నవారికి అందించి నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడే ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి చెందుతుందని శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. బుధవారం చిట్వేలి స్టేట్ బ్యాంక్ ఎదురుగా వైసిపి నాయకులు చిన్నపోలు వేణుగోపాల్ రెడ్డికి చెందిన వేణు హోం నీడ్స్ అండ్ పర్నిచర్స్ షాపును ప్రారంభించారు. మాకు ఉన్న అనుభవంతో తక్కువ ధరలకే వడ్డీ లేని రుణాలతో మొబైల్ తో పాటు అన్ని రకాల ఇంటి ఎలక్ట్రానిక్,పర్నిచర్ వస్తువులను అందిస్తామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎల్.వి మోహన్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి,సురేంద్ర రెడ్డి, ప్రదీప్ రెడ్డి, ఆకేపాటి రవీంద్రారెడ్డి ,ఎంపిపి చంద్ర, సర్పంచ్ బాలు,వైస్ ఎంపిపి ధ్వజ రెడ్డి,తోట శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page