top of page

లివర్ వ్యాధి బాధితునికి సిహెచ్ఎస్ 30 వేల సహాయం.

Writer: DORA SWAMY
DORA SWAMY
Sep 30, 2023
1 min read

లివర్ వ్యాధి బాధితునికి సి హెచ్ ఎస్ 30 వేల సహాయం.

లివర్ వ్యాధి చే అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి ఖర్చులకు దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న చిట్వేలి మండల కేఎస్ అగ్రహారానికి చెందిన మోడపోతుల నరసింహులు కు చిట్వేలి హెల్ప్ లైన్ సొసైటీ ఆధ్వర్యంలో 30100 (ముప్పై వేల వంద రూపాయల) నగదును శనివారం ఉదయం వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు సిహెచ్ఎస్ బాధ్యులు గాడి ఇంతియాజ్ తెలియపరిచారు.


ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహులు మెరుగైన వైద్యం కోసం ఏలూరు సీఎంసికి వెళుతున్నారని, అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలన్నారు. మోడపోతుల నరసింహులు సహాయార్థం అడిగిన వెంటనే "మానవసేవే మాధవసేవ" అన్న తలంపుతో సిహెచ్ సంస్థ ద్వారా స్పందించిన దాతలందరికీ బాధితుని కుటుంబ సభ్యులు తరపున,సిహెచ్ఎస్ సంస్థ తరఫున ఇంతియాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాల శివారెడ్డి,పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page